కొండపి: పొన్నలూరులో రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించిన పొన్నలూరు ఎస్సై అనూక్
పొన్నలూరు బస్టాండ్ సెంటర్లో గురువారం రాత్రి స్థానిక ఎస్సై అనూక్ వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుపడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలను పాటించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.