కొండపి: జరుగుమల్లి మండల కేంద్రంలోని బహిరంగ ప్రదేశాలలోమద్యం సేవిస్తున్న ముగ్గురుని అరెస్ట్ చేసిన ఎస్సై మహేంద్ర
జరుగుమల్లి మండల కేంద్రంలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను జరుగుమల్లి ఎస్సై మహేంద్ర గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మహేంద్ర మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తూ మహిళలకు అసౌకర్యం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ముగ్గురు పై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని అన్నారు.