కొండపి: నగరంలో టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య
ఒంగోలులో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు వీరయ్య చౌదరి దుండగులు చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి ఆయన మృతదేహాన్ని జీజీహెచ్లో మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య సందర్శించి నివాళులర్పించారు. వీరయ్య చౌదరి లాంటి నేతను టీడీపీ కోల్పోవడం బాధాకరమన్నారు. వీరయ్య చౌదరి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి ధైర్యం చెప్పారు.