కొండపి: కొండపి సిఐగా రమణయ్య, సింగరాయకొండ సిఐగా శ్రీహరి బాధ్యతలు స్వీకరణ, మంత్రి స్వామిని కలిసిన సిఐలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సిఐగా శ్రీహరి, కొండపిసిఐగా రమణయ్య ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరించిన అనంతరం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామిని సిఐలు కలిసి మొక్కను బహుకరించారు. సిఐలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సూచించారు. బాధ్యతలు స్వీకరించిన సిఐలు సర్కిల్లో ఎటువంటి నేరాలకు తావు లేకుండా పనిచేస్తామన్నారు.