సంతనూతలపాడు: సంతనూతలపాడు లో వైసీపీ ఇన్ ఛార్జ్ నాగార్జున ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు లో మాజీమంత్రి నాగార్జున ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని నాగార్జున విమర్శలు గుప్పించారు. మళ్లీ 2029 ఎన్నికలలో సీఎంగా జగనన్నే గెలుస్తారని పేదలందరూ ఆనందంగా ఉంటారని నాగార్జున అన్నారు. డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు.