రాయదుర్గం: ఆంద్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి.. ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే అమరావతి రాజధానికి లోక్‌సభ, రాజ్యసభలో ఆమోద ముద్ర పడటం ప్రతి తెలుగువారికీ గర్వకారణమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు అన్నారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. దీపాలు వెలిగించి ఏపి థాంక్స్ ఇండియా అంటూ నినదించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహసీల్దార్ హరికుమార్, టిడిపి నాయకులు టంకశాల హనుమంతు,