రాయదుర్గం: కణేకల్లు లో ఘనంగా ప్రారంభమైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి 333 వ ఆరాధన మహోత్సవాలు
కణేకల్లు రామనగర్ లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో 333 వ ఆరాధన, గురు పూజ మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ రాత్రికి గణపతి పూజ, హోమాలు నిర్వహించనున్నారు. భజన బృందం బ్రహ్మంగారి తత్వాలను వినిపిస్తూ ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం చిక్కణ్ణేశ్వర గుడి వరకూ ఊరేగింపు గ్రామోత్సవం ఉంటుందని, భక్తుల రాకకు తగ్గ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు.