కొండపి: కొండపి పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షం, భయపెట్టిన ఈదురు గాలులు మెరుపులు ఉరుములు
ప్రకాశం జిల్లా కొండపి పరిసర ప్రాంతాలను అకస్మాత్తుగా మారిన వాతావరణం వల్ల ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. మధ్యాహ్నం నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు మోస్తరు వర్షం ఉపశమనం కలిగించింది. ఈదురు గాలుల వల్ల కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉరుములు మెరుపులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసాయి.