మార్కాపురం: పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జేసీ శ్రీనివాసులు
మార్కాపురం జిల్లాలో పెట్రోల్ డీజిల్ బంకులపై ప్రత్యేక నిగా ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కొరత జిల్లాలో లేదని కృత్రిమ కొరత కృషి చేస్తే చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.