రాయదుర్గం: పట్టణంలో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాల ముగింపు
ఈనెల 14 నుంచి ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు రాయదుర్గంలో ఘనంగా ముగిశాయి. రాయదుర్గం అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల విజేతలకు MEO వెంకటరమేష్ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. వారోత్సవాల ప్రాధాన్యతను ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్ వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సరస్వతి రిటైర్డ్ LF బొమ్మన్న, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.