యర్రగొండపాలెం: వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పై వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఘాటు విమర్శలు చేశారు. ప్రశ్నిస్తుంటే తమపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇక్కడ దోచుకున్న డబ్బులను కనిగిరిలో దాచుకుంటున్నాడని ప్రశ్నిస్తే విషయం మళ్లించి నీది మార్కాపురం జిల్లా కాదని టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. కేసులు పెట్టి మళ్లీ మేమంతా ఒకటే అంటూ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. టిడిపిలో అంతర్గత వర్గ పోరు పెరిగిపోయిందన్నారు.