దర్శి: రాజానగరంలోని అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో అజిత
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రాజానగరం గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని ఎంపీడీవో అజిత, స్పెషల్ ఆఫీసర్ సుబ్బయ్య తనిఖీలు చేశారు. మంచినీటి సదుపాయం లేదని, మరుగుదొడ్లు సరిగా లేవని, ప్రహరీ గోడ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. అంగన్వాడీ కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పెషల్ ఆఫీసర్ సుబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.