దర్శి: డీజిల్ పెట్రోల్ కుత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన దర్శి సిఐ రామారావు
Darsi, Prakasam | Apr 26, 2026 ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్ పరిధిలో డీజిల్ పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రామారావు హెచ్చరించారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆయన పరిశీలించారు. స్టాక్ వివరాలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. కొరత ఉందని వచ్చే వదంతులను నమ్మవద్దని అన్నారు. డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉందన్నారు.