మార్కాపురం: జమ్మనపల్లి ఎస్సీ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి జమ్మనపల్లి ఎస్సీ కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్ జి రామ్ జి కరువు పని జమ్మనపల్లి ఎస్సీ కాలనీ వాసులకు అవకాశం కల్పించాలన్నారు. వీధి దీపాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. కాలనీ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతున్న డ్రైనేజీ కాలువలు లేవన్నారు.