కొండపి: సింగరాయకొండలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
సింగరాయకొండ లోని ఓ లాడ్జిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు శుక్రవారం స్థానిక ఎస్సై మహేంద్రా వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.20,300 నగదు స్వాధీనం చేసుకొని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎక్కడన్నా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్ఐ తెలిపారు.