రాయదుర్గం: 74 ఉడేగోళంలో సత్ఫలితాలు ఇస్తోన్న కలెక్టర్ గ్రీవెన్స్
రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో ప్రభుత్వ ప్రతిష్టాత్మక 'ఒక నెల నాలుగు సందర్శనలు' కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. గత నెల 22వ తేదీ నుంచి మూడు దఫాలుగా జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ వారం వారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించగా మొత్తం 87 అర్జీలు అందాయి. వాటిలో 76 అర్జీలను అధికారులు అప్పటికప్పుడే పరిష్కరించగా, మిగిలిన 11 అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. శుక్రవారం అదే గ్రామంలో కలెక్టర్ నాల్గవసారి పర్యటించారు. గత మూడు వారాల్లో వచ్చిన వినతుల పురోగతిపై ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ సూర్యప్రతాప్ తదితర అధికారులతో సమీక్షించారు.