కొండపి: కొండపిలో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి స్వామి, మారీచుడు వల్లే మాజీ సీఎం జగన్ అవతారాలు మారుస్తున్నారని ఆగ్రహం
ప్రకాశం జిల్లా కొండపిలో గురువారం ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి మీడియాతో మాట్లాడారు. రాజధాని విషయంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మారీచుడు వల్లే రూపాలు మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలను అయోమయానికి గురిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా చేసే యోచననే జగన్ చేస్తున్నారని అన్నారు. కూటమిపాలనలో రాష్ట్ర వేగంగా అభివృద్ధి చెందుతుందని రాజధాని విషయంలో జగన్ ఆందోళనకు గురిచేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా చేయడమే మొక్క ఉద్దేశంగా ఉన్నట్లుగా తెలుస్తుందని మంత్రి అన్నారు.