గిద్దలూరు: కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని స్థానిక పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేశామని పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.10,580 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 100 లేదా 112 నంబర్ను సంప్రదించి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.