దర్శి: పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించిన వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | May 14, 2026 మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రాన్ని వైసీపీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరియు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పరిశీలించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఐదు వందల కోట్లు కేటాయించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంట పండించిన రైతులు తీవ్ర ఆవేదంలో ఉన్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఇంకా ఎవరు ఆదుకుంటారని ప్రశ్నించారు.