కొండపి: మర్రిపూడి ఎస్ఐ అమాయకుడిని కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, కొండపి వైసిపి ఇన్ ఛార్జ్ ఆదిమూలపు సురేష్
పోలీసులు ఆరేళ్ల నాటి కేసు తవ్వి మర్రిపూడి మండలం గార్లపేటకు చెందిన బేల్దారి మేస్త్రి ప్రసాదు వేధిస్తోందని మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. ఆత్మహత్యాయత్నం చేసి ఒంగోలులో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. 'మంత్రి ప్రోద్బలంతోనే మర్రిపూడి ఎస్ఐ ప్రసాద్ ను బెల్ట్ తో దారుణంగా కొట్టాడు. బాధితుడికి న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుంది' అని ఆయన చెప్పారు.