మార్కాపురం: రాయవరం గ్రామంలో నిరుపయోగంగా మారిన పశువుల ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు
మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రూప్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేశారు. సుమారు 55 వేలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసి నిరుపయోగంగా వదిలివేశారు. అందులో పిచ్చి చెట్లు దర్శనమిస్తున్నాయి. అదేవిధంగా వేసవిలో మూగజీవాలకు నీటి కొరత లేకుండా చూడడం, పశువులను సంరక్షించుకోవడానికి గ్రామంలో నీటి తొట్టి లను ఏర్పాటు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆరోపించారు.