మార్కాపురం: జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్యం అధ్వానం ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఎక్కడ వేసిన చెత్తాచెదారంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండుకు సమీపంలో ఉన్న ఎన్ఎస్ నగర్ లో రోడ్డుకు ఒక వైపు చెత్తాచెదారం వేసి డంపుగా మార్చారు. ఆ ప్రాంతంలో పందులు గందరగోళం చేస్తున్నాయి. దీంతో దుర్వాసన వెదజల్లడంతో ముక్కున వేలు వేసుకొని ఆ రహదారి గుండా స్థానికులు వాహనదారులు వెళ్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.