దర్శి: దొనకొండ మండల కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు పంపిణీ
Darsi, Prakasam | Apr 24, 2025 దొనకొండ మండల కేంద్రంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయం నందు మండల వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను గురువారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 23 మంది రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. సుమారు ఐదులక్షలు చేసే పనిముట్లు రైతులకు అందజేశామని, ఈ పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకొని వ్యవసాయ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.