గిద్దలూరు: రాచర్ల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో చెత్త సేకరించి రిక్షాలను పచ్చజెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా రాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం చెత్త సేకరించే రిక్షాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రాచర్ల మండలానికి 16 చెత్త సేకరించి రిక్షాలను అందించడం జరిగిందని తడి చెత్త పొడి చెత్త విడిగా సేకరించి చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు తరలించాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు సిబ్బందికి సూచించారు. ప్రజలు కూడా గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ తడి చెత్త పొడి చెత్త విడివిడిగా వేసి అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు.