విశాఖపట్నం: ఏపీలో తుపాను హెచ్చరికలు: 125 కి.మీ వేగంతో గాలులు, అధికారులకు కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాపట్ల-విశాఖ తీరం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో హోంమంత్రి అనిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం సూచించింది.