కొండపి: సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి బండలగుడి పోటీలు ప్రారంభించిన నిర్వాహకులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రస్థాయి బండలకు పోటీలను ఆలయ ఈవోతో పాటు స్థానిక టిడిపి నాయకులు ప్రారంభించారు. పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఎడ్ల జతలతో యజమానులు హాజరయ్యారు. పోటీలలో విజయం సాధించే విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు వారు తెలిపారు.