నెలబల్లి రెట్టపల్లికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించండి : సీపీఐ
గూడూరు నుంచి నెలబల్లి రెట్టపల్లికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని సీపీఐ నాయకులు కోరారు. మంగళవారం గూడూరులోని సీపీఐ కార్యాలయంలో నాయకులు ప్రభాకర్, శశి, రమేష్ మాట్లాడారు. గతంలో గూడూరు నుంచి నెలబల్లి రెట్టపల్లికి బస్సు సర్వీసు ఉండేదన్నారు. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగుల సౌకర్యార్ధం నిలిపివేసిన బస్సు సర్వీసును పునరుద్దరించాలన్నారు. అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్కి వినతిపత్రం సమర్పించారు.