రాయదుర్గం: అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించాలి : అంగన్వాడీ యూనియన్ నేతల డిమాండ్
అంగన్వాడీ కేంద్రాలకు మే నెల అంతా వేసవి సెలవులు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్ఫర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు గోవిందమ్మ, మేరి డిమాండ్ చేశారు. యూనియన్ పిలుపు మేరకు గురువారం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవిలో ఎండలు తీవ్రంగా ఉన్నాయని కేంద్రాలకు వచ్చే బాలబాలికలు ఎండవేడి ప్రభావానికి గురికాకుండా ఉండేందుకు తక్షణమే సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.