యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తుకు రక్షణ కల్పించాలన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క చిన్నారికి చుక్కలు అందేలా వైద్య సిబ్బంది వైసీపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.