ఉరవకొండ: బూదగవి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో విశేష పూజలు
ఉరవకొండ మండలం బూదగవిలో వెలసి ఉన్న ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు చేశారు. ఆలయ అర్చకులు అర్చనలు, అభిషేకాలు, కాగడ హారతి వంటి పూజలు చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారి దర్శన భాగ్యాన్ని భక్తులకు అర్చకులు కల్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆలయంతో పాటు పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.