యర్రగొండపాలెం: ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో ఇండ్లు కోల్పోయిన కుటుంబానికి టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయం అందజేశారు. కొలుకుల రోడ్డులోని నివాసముంటున్న అంజిరెడ్డి రేకుల ఇండ్లు గాలి వానకు కూలిపోయింది. దీంతో ఎరిక్షన్ బాబు అధికారులతో కలిసి కూలిన ఇండ్లను పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.