తాడిపత్రి: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి: తాడిపత్రిలో వైసీపీ నియోజకవర్గ అధ్యక్షులు రాఘవేంద్ర
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అందరూ ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకోవాలని తాడిపత్రి నియోజకవర్గం వైసీపీ అధ్యక్షులు రాఘవేంద్ర, పట్టణ అధ్యక్షులు రాబర్ట్ పిలుపునిచ్చారు. తాడిపత్రిలో మంగళవారం వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ కేవలం రాజ్యాంగాన్ని రాయడమే కాకుండా దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు. అంబేద్కర్ మహా మేధావన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.