మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. చింతల సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటా హుటిన అక్కడికి చేరుకొని గాయపడిన వారిని దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.