యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టిడిపి కార్యాలయంలో వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన బాధితులకు టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న 15 మందికి 14,14,621 రూపాయల సీఎం సహాయునిది చెక్కులను అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ ప్రజల ఇబ్బందులను తెలుసుకొని ఆర్థిక చేయూత ఇస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుంది అన్నారు.