కొండపి: టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో పేకాట ఆడుతున్న 9 మందిని మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వాడి వద్ద నుంచి రూ.3,640 నగదు 8 మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపారు.