మార్కాపురం: జిల్లా కేంద్రంలో మెడికల్ షాపులు మూసివేసి నిరసన ర్యాలీ చేపట్టిన దుకాణదారులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెడికల్ షాపులన్నీ మూసివేసి స్వచ్ఛందంగా బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ముందుగా దుకాణదారులు ప్రధాన రహదారులలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్ అండ్ బి కార్యాలయం ముందు ధర్నా చేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట బాలు పర్వతాలు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థలు అధిక డిస్కౌంట్ ల ద్వారా అనైతిక వ్యాపారం నిర్వహిస్తూ చిన్నచిన్న మెడికల్ షాపుల నిర్విర్యానికి పాల్పడే విధానాన్ని అరికట్టాలన్నారు.