కొండపి: మర్రిపూడి మండలం వేములవరం గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం వేములవరం గ్రామంలో సిఐ రమణయ్య ఆధ్వర్యంలో మంగళవారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. స్థానిక ప్రజలకు గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఉండాలని సూచిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు. తర్వాత అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతోపాటు వారి వివరాలను పోలీసులు సేకరించారు.