దర్శి: దర్శి పట్టణంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | Apr 14, 2025 దర్శి పట్టణంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కొట్టిపాటి లక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు. ఆయన ఆశయాలు కొనసాగించాలని, కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తుందని ఆమె తెలిపారు.