రాయదుర్గం: పట్టణంలో లడ్డూవారి. ఛమ్మా వారి పీర్ల చావిడిల్లో ఘనంగా పీర్ల చిన్న సరిగెత్తు
రాయదుర్గంలో పట్టణంలోని లడ్డు వారి, ఛమ్మా వారి పీర్ల చావిడిల్లో పీర్ల చిన్న సరిగెత్తు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. విద్యుత్ దీపాలతో అలంకరించిన ఛమ్మా చావిడిలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున స్వాములను డప్పు వాయిద్యాల నడుమ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. భక్తులు హారతులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పీర్ల ఉత్సవాలు హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీక అని నిర్వాహకులు లడ్డు ఖాసిం, నూర్ మొహమ్మద్, ఛమ్మా అజీజ్ తదితరులు తెలియజేశారు.