మార్కాపురం: జిల్లా కేంద్రంలోని మీనా మసీదు వద్ద డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం స్థానికులు తీవ్ర ఇబ్బందులు
మార్కాపురం మీనా మసీదు సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో కాలువలోని మురుగునీరు రోడ్లపై ప్రవహించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సరైన రోడ్లు లేకపోవడంతో అష్ట కష్టాలు పడుతున్నారు. నూతన జిల్లా ఏర్పడడంతో స్థానిక ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశామన్నారు. కానీ డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల పరిస్థితి మెరుగు పడలేదని స్థానికులు వాపోయారు. అధికారులు దృష్టి పెట్టాలని కోరారు.