రాయదుర్గం: ఉప్పరహాల్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
*ఉప్పరహాల్‌లో అనుమానాస్పద మృతి - కుమారుడిపై అనుమానం* బొమ్మనహళ్ మండలంలోని ఉప్పరహాల్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున బోయ హనుమంత రెడ్డి (52) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కుటుంబ కలహాలతో కుమారుడే తండ్రిని కొట్టి చంపాడని గ్రామస్తుల నుండి సమాచారం అందడంతో ఎస్ఐ నబిరసూల్ పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.