రాయదుర్గం: బైక్ పై వెళుతూ గుండెపోటుతో మరణించిన కర్నాటక వాసి
రాయదుర్గం శివారులోని మల్లాపురం లేఅవుట్ సమీపంలో ఓ వ్యక్తి గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు కర్నాటక రాష్ట్రం పరశురాంపురం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి హనుమంతప్ప మంగళవారం బైక్ పై నాగసముద్రం నుంచి వస్తూ చాతీనొప్పికి గురయ్యాడు. బైక్ దిగి చెట్టు కింద కూర్చొని అక్కడే ప్రాణాలు వదిలాడు. 108 సిబ్బంది పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.