కొండపి: సింగరాయకొండ లోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు సవిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని జైల్లో శాఖ బీసీ శాఖ మంత్రి సవితతో పాటు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొని అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. తర్వాత మంత్రులను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని మంత్రులు సవిత స్వామి అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.