కొండపి: కొండపి మండలం నేతివారిపాలెం లో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం సమీపంలోని పొలాలలో పేకాట ఆడుతున్న ముగ్గురిని ఆదివారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.10,860 నగదు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.