యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో వీరంగం సృష్టించిన మద్యం మత్తులో ఉన్న యువకులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో కొంతమంది యువకులు సోమవారం రాత్రి రెచ్చిపోయి రోడ్ నడిరోడ్డుపై గొడవకు దిగారు. చిన్న వాగ్వాదం క్షణాల్లోనే హింసాత్మకంగా మారడంతో స్థానికులు భయంతో గురయ్యారు. పోలీసులు వెంటనే చేరుకొని యువకులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మత్తు పదార్థాల వల్ల యువత తప్పుదారి పడుతుందని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.