కళ్యాణదుర్గం: కంప చెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయిన కుందుర్పిలోని మండ్ల చెరువు
కుందుర్పిలోని మండ్ల చెరువు కంపచెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. చెరువు కింద వందలాది ఎకరాలు ఆయకట్టు ఉంది. చెరువు నిండితే ఆయకట్టు కింద రైతులు వరి పంటను సాగు చేస్తారు. అయితే చెరువులో నీళ్లు లేకపోవడం తో పంటలు సాగు చేయలేదు. ఈ ఏడాది పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే నీళ్లు లేకపోవడంతో పాటు చెరువు మొత్తం కంపచెట్లతో నిండిపోయింది. చెరువును శుభ్రం చేయాలని ఆదివారం పలువురు రైతులు కోరుతున్నారు.