రాయదుర్గం: పులకుంట లో మామిడి చెట్లు నరికేసిన దుండగులు
గుమ్మగట్ట మండలం పులకుంటలో రైతులు ట్యాంకర్లతో నీరు తోలి పెంచిన మామిడి చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికేశారు. గోవిందప్ప, సరస్వతి, లక్మీకాంతమ్మ, మహంతేష్ లు ఉమ్మడిగా 700 మామిడి మొక్కలను గత 4 ఏళ్లుగా పెంచుతున్నారు. మంగళవారం పొలానికి వెళ్లి చూడగా పదికి పైగా చెట్ల ను నరికి పడేసిన దృశ్యాలు చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.