రాయదుర్గం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆర్ఓ నీటి ప్లాంట్ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తో కలసి ఆదివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, టిడిపి నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంత్రి కి స్వాగతం పలికారు. ఆర్ ఓపెనింగ్ తర్వాత అర్దాంతరంగా ఆగిపోయిన నూతన భవనాలు పరిశీలించారు. కేవలం 13 నిముషాలలో మంత్రి ఆసుపత్రి పర్యటన ముగించారు.