మార్కాపురం: జిల్లా కేంద్రంలోని పలు లాడ్జిలను తనిఖీ చేసిన సీఐ ఆల్తాఫ్ హుస్సేన్
మార్కాపురం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో సీఐ ఆల్తాఫ్ హుస్సేన్ పలు లాడ్జిలను తనిఖీ చేశారు. చెడ్డి గ్యాంగ్ కదలికల నేపథ్యంలో అనుమానస్పద వ్యక్తులపై క్షుణ్ణంగా తనిఖీ చేసి ఆరా తీశారు. లాడ్జిలలో ప్రతి ఒక్కరి వివరాలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆధార్ కార్డులను సేకరించాలన్నారు. ఏదైనా అనుమానం వచ్చిన ఎడల వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.