దర్శి: దొనకొండ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు చేపట్టిన కాశయ్య
Darsi, Prakasam | Jul 13, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీఆర్వో కాశయ్యకు సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి కల్పించారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు స్వీకరించినట్లు కాశయ్య తెలిపారు. అధికారుల సమన్వయంతో ప్రజలకు సేవ చేసేందుకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఉన్నత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.